D News: Oct 21: మహబూబ్‌నగర్‌లో పోలీసు అమరవీరులకు ఘన నివాళి

మహబూబ్‌నగర్: పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో స్మృతి పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి. జానకి ముఖ్య అతిథిగా హాజరై, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.

అక్టోబర్ 21న స్మారక దినోత్సవం

1959లో లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగానికి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డి. జానకి తెలిపారు. దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

అమరవీరుల కుటుంబాలకు పరామర్శ

కార్యక్రమంలో భాగంగా అమరవీరుల కుటుంబ సభ్యులతో ఎస్పీ మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి పరదేశి నాయుడు సర్కిల్ వరకు స్మారక ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీలు, పోలీసు ఇన్‌స్పెక్టర్లు, ఇతర పోలీసు సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana