
D Spiritual: Oct 15: మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి మూడు చేనేత పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరలను సమర్పించనున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య ఆధ్వర్యంలో, జయరాజ్ సహకారంతో ఎల్బీనగర్కు చెందిన గంజి కృష్ణ, జూలూరు లక్ష్మయ్య ఈ చీరలను ప్రత్యేకంగా నేస్తున్నారు.
అక్టోబరు 11న ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చీరల నేత కార్యక్రమాన్ని ప్రారంభించారు. మగ్గంపై స్వయంగా నేస్తున్న ఈ చేనేత పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరలను విజయదశమి రోజున అమ్మవారికి సమర్పించనున్నారు.
