D Educt: Oct 15: ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలల్లో పీజీ మెడికల్‌ కోర్సుల ఇన్‌సర్వీస్‌, నాన్‌ సర్వీస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ కోటా సీట్లకు అర్హులైన అభ్యర్థులు అక్టోబరు 21వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రవేశ ప్రక్రియకు సంబంధించి సందేహాలుంటే 89787-80501, 90007-80707 నంబర్లలో సంప్రదించవచ్చని వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సాయి సుధీర్‌ తెలిపారు.