D Spiritual: Oct 15: దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 16న మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రత్యేక వైదిక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు సంజు పూజారి తెలిపారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

అక్షరాభ్యాసాలకు ప్రసిద్ధి చెందిన బాసర క్షేత్రంలో మూలా నక్షత్రానికి విశేష ప్రాధాన్యం ఉంది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతోపాటు చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయిస్తారు. భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునేలా, వైదిక కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.