D Spiritual: Sept 24: నిమజ్జనానికి సిద్ధమైన ఖైరతాబాద్ మహాగణపతి

హైదరాబాద్‌లో శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతిగా భక్తుల పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. తొమ్మిది రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చిన మహాగణపతికి గురువారం రాత్రితో దర్శనాలు ముగిశాయి.

శుక్రవారం ఉదయం ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. ప్రత్యేక ఏర్పాట్ల మధ్య భారీ ఊరేగింపుగా విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్ వైపు తరలించనున్నారు. శోభాయాత్రను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మధ్యాహ్నంలోపే మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. నిమజ్జనాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత వంటి అంశాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana