
D Educt: Sept 24: అగ్రి బీఎస్సీ, బీటెక్ కోర్సుల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి బైపీసీ విభాగం విద్యార్థులకు పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. అగ్రి బీఎస్సీ (హానర్స్), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ప్రక్రియ చేపట్టారు.
మొదటి దశ వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 24 నుంచి 26వ తేదీ వరకు కొనసాగుతుందని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఎ. మణి సెప్టెంబర్ 23న విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు, మార్గదర్శకాలను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చని తెలిపారు.
