
D News: కోలీవుడ్ దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘వెట్టువం’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ‘వరల్డ్ ఆఫ్ వెట్టువం’ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆర్య, శోభితా ధూళిపాళ్ల, వి.ఆర్. దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.
‘వెట్టువం’ కథ మూడు కాలాల నేపథ్యంలో సాగనుంది. పురాతన కాలం, వర్తమానం, భవిష్యత్తును కలుపుతూ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కథగా రూపొందుతోంది. మానవ ఆధిపత్యం, పవర్ పాలిటిక్స్, ప్రకృతి మార్పులు.. ఈ భూమిని ఎవరు ఏలాలనే పోరాటం చుట్టూ కథ నడవనుంది.
ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పురాతన యుద్ధకళ ‘అడిమురై’ ఆధారంగా ఫైట్స్‌ను రూపొందించారు. ఇందుకోసం నటీనటులు ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు చిత్రబృందం తెలిపింది.
‘సర్పట్ట పరంపరై’ తర్వాత పా. రంజిత్, ఆర్య కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు పెరిగాయి. కలైయరసన్, మైమ్ గోపి, గురు సోమసుందరం, షబ్బీర్ కల్లరక్కల్, జాన్ విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
