Naga Chaitanya’s Vrushakarma Release Date Locked: Mythical Thriller to Hit Theaters on December 4, 2026

D News: యువ సామ్రాట్ నాగచైతన్య, దర్శకుడు కార్తీక్ దండు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మైథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను బాపినీడు సమర్పిస్తున్నారు. మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలను సరికొత్త నేపథ్యంలో కలిపి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు.

తాజాగా ‘వృషకర్మ’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4, 2026న థియేటర్లలో విడుదల కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది.

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, బిహైండ్ ది సీన్స్ వీడియోలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇందులో నాగచైతన్య డిఫరెంట్ లుక్, మ్యాసీవ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో కనిపించనున్నారు. తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ఆయన ఇప్పటికే పూర్తి చేశారు.

మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా కనిపించనున్నారు. గ్లింప్స్‌లో స్పర్శ్ శ్రీవాస్తవ ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆయన పాత్రపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

రిలీజ్ డేట్ లాక్ కావడంతో త్వరలోనే భారీ ప్రమోషనల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. దేశీయ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ సినిమాను భారీగా ప్రమోట్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.

ఈ చిత్రానికి రాగుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అజనీష్ బి. లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

By Avinash