
D News: లీడ్ యాక్టర్‌గా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఎంట్రీ ఇచ్చిన ‘డీసీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆగస్టు 7న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ విజయాన్ని పురస్కరించుకుని నిర్మాత, సన్ పిక్చర్స్ అధినేత కలానిధి మారన్ మూవీ టీమ్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్, హీరో లోకేశ్ కనగరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌లను అభినందించిన ఆయన.. ముగ్గురికీ సరికొత్త BMW X7 కార్లను బహుమతిగా అందించారు. కార్ల తాళాలను స్వయంగా అందజేస్తున్న వీడియోను సన్ పిక్చర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ‘డీసీ’లో లోకేశ్ కనగరాజ్‌తో పాటు వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. లోకేశ్ తొలిసారి పూర్తిస్థాయి లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమా యాక్షన్, పెర్ఫార్మెన్స్, మ్యూజిక్‌కు మంచి స్పందన అందుకుంది.
ఇక థియేట్రికల్ సక్సెస్ తర్వాత ‘డీసీ’ సెప్టెంబర్ 4 నుంచి సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది.
