
D News: టాలీవుడ్లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న నివేదా థామస్ మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు ‘శ్రీమతి’ సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
2024లో వచ్చిన ‘35 చిన్న కథ కాదు’ సినిమాలో నివేదా తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె సినిమాలకు కాస్త గ్యాప్ ఇవ్వడంతో.. ఇక ఇండస్ట్రీకి దూరమవుతుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే వాటికి చెక్ పెడుతూ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.
‘శ్రీమతి’ ఫస్ట్ లుక్‌లో నివేదా పూర్తిగా గృహిణి పాత్రలో కనిపిస్తోంది. కిచెన్‌లో నడుముపై చేయి వేసుకుని నిల్చున్న ఆమె లుక్ చాలా సహజంగా ఉంది. పక్కన గరిటె, కాఫీ కప్.. వెనుక గ్యాస్ స్టవ్, వంట పాత్రలు కనిపించేలా పోస్టర్‌ను డిజైన్ చేశారు.
“ప్రతి ఇంటి హృదయం నుంచి ఒక కథ పుడుతుంది.. మనకు తెలిసిన, మనం ప్రేమించే, మనం జీవించే కథ” అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. సాధారణ గృహిణి జీవితంలో ఎదురయ్యే భావోద్వేగాలు, కుటుంబ పరిస్థితులు, ఆమె చుట్టూ జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ కథ సాగనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ‘సతీ లీలావతి’తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విశ్వక్ ఖండేరావు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నివేదా థామస్‌ను మరో విభిన్నమైన పాత్రలో చూడబోతుండటంతో ‘శ్రీమతి’పై ఇప్పటి నుంచే ఆసక్తి మొదలైంది.
