Jadal Mania Takes Over Overseas.. Nani’s The Paradise Sets a Pre-Release Record!

D News: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలకు ముందే రికార్డుల వేట మొదలుపెట్టింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమాకు వస్తున్న స్పందన ఆసక్తిని పెంచుతోంది. సెప్టెంబర్ 24న ఈ సినిమా థియేటర్లలోకి రానుండగా.. ఓవర్సీస్‌లో మాత్రం ఒకరోజు ముందుగానే సెప్టెంబర్ 23న విడుదల కానుంది.

ఉత్తర అమెరికాలో మొదలైన ప్రీసేల్ బుకింగ్స్‌కు మంచి స్పందన లభించింది. బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే 1 లక్ష డాలర్ల అడ్వాన్స్ సేల్స్ మార్క్‌ను అందుకున్నట్లు సమాచారం. దీంతో అక్కడ అత్యంత వేగంగా ఈ మార్క్‌ను చేరుకున్న తెలుగు సినిమాగా ‘ది ప్యారడైజ్’ నిలిచినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ వసూళ్లు ప్రధానంగా సినీమార్క్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా నమోదయ్యాయి.

విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అడ్వాన్స్ బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాని ఈ సినిమాలో జడల్ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది.

ఇక ‘ది ప్యారడైజ్’ పాటలు కూడా సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. ఇటీవల విడుదలైన ‘ఏషనాగుల’ పాట యూట్యూబ్‌లో వేగంగా వ్యూస్ సాధిస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే 50 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకోగా.. పది రోజుల్లో 76 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు సమాచారం.

మొత్తానికి విడుదలకు ఇంకా సమయం ఉండగానే ఓవర్సీస్ ప్రీసేల్స్, పాటల వ్యూస్‌తో ‘ది ప్యారడైజ్’ హైప్ పెంచుకుంటోంది. సినిమా విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద జడల్ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడో చూడాలి.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana