
D News: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మరోసారి తనదైన స్టైల్లో చేసిన కామెంట్స్‌తో వార్తల్లో నిలిచారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల సినిమాల్లోని హీరోలపై వంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
‘90’s’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ‘ఎపిక్’లో ఓ ఆసక్తికరమైన డైలాగ్ ఉంది. “శేఖర్ కమ్ముల సినిమాలో హీరో లాంటి అబ్బాయికి.. సందీప్ రెడ్డి వంగా సినిమాలో హీరో లాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ” అంటూ వచ్చే ఈ డైలాగ్పై ఈవెంట్లో యాంకర్ సుమ సందీప్ వంగాను ప్రశ్నించారు.
దీనికి స్పందించిన సందీప్ రెడ్డి వంగా.. శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోలంటే తనకు పెద్దగా ఇష్టం ఉండదని స్పష్టం చేశారు. అయితే ఆయన సినిమాల్లోని హీరోయిన్ల పాత్రలు, వాటి డిజైనింగ్ మాత్రం తనకు బాగా నచ్చుతాయని చెప్పారు.
‘ఎపిక్’ టీజర్‌లోని ఈ డైలాగ్ వినడానికి ఆసక్తికరంగా అనిపించిందని, శేఖర్ కమ్ముల హీరో తరహా అబ్బాయి, తన సినిమాల్లో కనిపించే హీరో తరహా అమ్మాయి కలిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ ఆసక్తిని పెంచిందని సందీప్ వంగా పేర్కొన్నారు.
ఇక ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఇప్పటికే భిన్నమైన కథలు, విభిన్నమైన క్యారెక్టరైజేషన్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల, సందీప్ రెడ్డి వంగా పేర్లు ఒకే సందర్భంలో రావడంతో అభిమానుల్లోనూ ఈ వ్యాఖ్యలపై ఆసక్తి నెలకొంది.
