
కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కలిసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇందిరాభవన్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో వారు భేటీ కానున్నారు.
ఈ సందర్భంగా ఇందిరాభవన్ వద్ద మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఢిల్లీకి వచ్చామని ఆయన సేవలను స్మరించుకుంటున్నామని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కలవనున్నట్లు చెప్పారు.
తెలంగాణలో పార్టీ సంస్థాగత అంశాలతో పాటు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై కేసీ వేణుగోపాల్‌తో చర్చించనున్నట్లు మహేశ్ గౌడ్ వెల్లడించారు. మంత్రి కొండా సురేఖకు సంబంధించిన అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అలాగే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలవనున్నట్లు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
