
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ **‘స్పిరిట్’**పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదల తేదీపై ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారానికి చిత్రబృందం తాజాగా స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.
‘స్పిరిట్’ రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని మేకర్స్ స్పష్టం చేసినట్లు సమాచారం. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే 2027 మార్చి 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. షూటింగ్ పనులు కూడా అనుకున్న ప్రణాళిక ప్రకారమే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను అదే స్థాయిలో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో ప్రభాస్ తొలిసారి ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటివరకు తన కెరీర్లో చేయని విధంగా పోలీస్ పాత్రలో డార్లింగ్ కనిపించనుండటంతో ఈ క్యారెక్టర్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే ప్రభాస్ లుక్, మేకోవర్‌కు సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సందీప్ రెడ్డి వంగా తనదైన స్టైల్లో హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘స్పిరిట్’ను తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. యాక్షన్‌తో పాటు ఎమోషన్, పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం.
టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది.
మొత్తానికి ‘స్పిరిట్’ రిలీజ్ డేట్‌పై వస్తున్న పుకార్లకు మేకర్స్ చెక్ పెట్టడంతో ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 2027 మార్చి 5న ‘స్పిరిట్’ థియేటర్లలోకి రావడం ఖాయమని చిత్రబృందం స్పష్టం చేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
