యంగ్ మ్యూజిక్ సెన్సేషన్, సింగర్ సాయి అభ్యంకర్ తన ఆరో ఇండిపెండెంట్ సాంగ్ ‘రాధిమా’ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇప్పటివరకు తన మ్యూజిక్‌తో యూత్‌ను ఆకట్టుకుంటున్న సాయి.. ఈసారి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనుభవాలను పాట రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ పాట టైటిల్ వెనుక ఉన్న కథ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సాయి అభ్యంకర్ మాట్లాడుతూ.. ‘రాధిమా’ పూర్తిగా బ్రేకప్ నేపథ్యంలో రూపొందించిన పాట అని వెల్లడించారు. ప్రేమలో పడటం, ఆ తర్వాత ఎదురయ్యే బ్రేకప్, దాని నుంచి మిగిలే బాధ, భావోద్వేగాలను పాటలో చూపించే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. అందుకే ఈ సాంగ్ తనకు ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ప్రేమలో ఉన్నవారితో పాటు బ్రేకప్‌ను ఎదుర్కొన్న వారికి కూడా ఈ పాట బాగా కనెక్ట్ అవుతుందని సాయి అభ్యంకర్ తెలిపారు.

అయితే ఈ పాటకు ‘రాధిమా’ అనే పేరు పెట్టడం వెనుక ఉన్న కారణం ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. తన మాజీ ప్రేయసి పేరునే ఈ పాటకు టైటిల్‌గా పెట్టినట్లు సాయి అభ్యంకర్ స్వయంగా వెల్లడించారు. దీంతో ఈ పాట కేవలం కల్పిత ప్రేమకథ ఆధారంగా రూపొందినది కాదని, తన నిజ జీవిత అనుభవాల నుంచి పుట్టుకొచ్చిందనే విషయం స్పష్టమవుతోంది.

తన గత ప్రేమకథలోని భావాలను మ్యూజిక్ ద్వారా వ్యక్తపరిచే ప్రయత్నం చేయడంతో ‘రాధిమా’ మరింత వ్యక్తిగతమైన పాటగా మారింది. ఒకవైపు బ్రేకప్ ఎమోషన్.. మరోవైపు మాజీ ప్రేయసి పేరును టైటిల్‌గా పెట్టడం.. ఈ రెండు అంశాలు పాటపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

ఇప్పటికే ఇండిపెండెంట్ మ్యూజిక్‌తో సాయి అభ్యంకర్ యూత్‌లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తన ప్రత్యేకమైన మ్యూజిక్ స్టైల్‌తో వరుసగా కొత్త పాటలను అందిస్తూ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నారు. సినిమాలతో పాటు ఇండిపెండెంట్ సాంగ్స్‌పైనా ఫోకస్ పెంచుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత జీవితంలోని ఓ భావోద్వేగాన్ని పాటగా మలిచిన ‘రాధిమా’కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana