
DET:MAR 18:
బిజినెస్ అప్‌డేట్:
సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై ట్రేడ్ సర్కిల్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.తాజాగా జరిగిన ఈ డీల్ సినిమా క్రేజ్‌ను మరోసారి నిరూపించింది.శ్రీ లక్ష్మి నరసింహ మూవీ మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం.
డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్:
ఈ సంస్థకు తెలుగు రాష్ట్రాల్లో బలమైన పంపిణీ వ్యవస్థ ఉండటం వల్ల రాకాస సినిమాకు భారీ స్థాయిలో థియేటర్లు దక్కే అవకాశం ఉంది.మ్యాడ్ ఫేమ్ సంగీత్ శోభన్,నయనర్ సారిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.వెన్నెల కిషోర్,బ్రహ్మాజీ,తనికెళ్ల భరణి,గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు.మానస శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.నిహారిక కొణిదెల ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
మ్యూజిక్:
అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన రపప్పా పదే పదే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమా ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.ఓవర్సీస్ ప్రీమియర్లు ఏప్రిల్ 2నే ప్రదర్శించనున్నారు.డిజిటల్ హక్కులను ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోవడం విశేషం.
