
DET:MAR 17:
అసలేం జరిగింది?
హైదరాబాద్‌లో జరిగిన ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్‌లో పార్తీబన్ మాట్లాడుతూ.. తన మూలాల గురించి ప్రస్తావించారు.నేను రాధాకృష్ణన్ పార్తీబన్ ఒక నాయుడు అబ్బాయిని అని పరిచయం చేసుకున్నారు.తనది తెలుగు నేపథ్యం కాబట్టే తమిళం అంత అనర్గళంగా మాట్లాడగలుగుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు.అయితే గతంలో ఆయన కులరహిత సమాజం గురించి మాట్లాడిన మాటలకు ఇప్పుడు ఇలా కులాన్ని ప్రస్తావించడానికి పొంతన లేదంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
పార్తీబన్ ఆడియో స్టేట్‌మెంట్ ముఖ్యాంశాలు:
ఈ వివాదంపై స్పందిస్తూ ఆయన ఒక భావోద్వేగపూరిత వివరణ ఇచ్చారు.ఎందుకు జరుగుతుందో తెలియదు కానీ కొన్ని విషయాలు ఎటువంటి ప్రయోజనం లేకుండా చర్చలుగా మారి ప్రజా శాంతిని భంగపరుస్తాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నేను తమిళ భాషను ఎంత ప్రేమించినా,నా బర్త్ సర్టిఫికేట్‌ను మార్చుకోలేను కదా? ఏ బిడ్డ కూడా తన తల్లిదండ్రులను లేదా కులాన్ని ఎంచుకోదు. అది నా బాధ్యత కాదు అని స్పష్టం చేశారు.
తడబాటు వల్ల జరిగిన పొరపాటు:
ఆ స్టేజీపై తెలుగులో మాట్లాడాలని ప్రయత్నించినప్పుడు కలిగిన టెన్షన్ మరియు ఆందోళన వల్ల మాటలు దొర్లాయని ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు.తన బ్రతుకుదెరువు గౌరవం అంతా తమిళం వల్లే వచ్చిందని చివరి వరకు అదే తన స్వర్గమని పునరుద్ఘాటించారు.
త్రిష వివాదం తర్వాత మరో రచ్చ:
ఇటీవలే నటి త్రిషపై చేసిన కుందవై వ్యాఖ్యల వల్ల పార్తీబన్ వార్తల్లో నిలిచారు.ఆ వివాదం సర్దుమణగక ముందే ఇప్పుడు కులం మరియు తెలుగు నేపథ్యం గురించి చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ మరియు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
