AP: AI revolution in hospitals... Diseases identified through AI-DTv Telangana

DNews: Mar09: ప్రపంచం మొత్తం ఐటీ నుంచి ఏఐ వైపు మళ్లుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు మొత్తాన్ని పూర్తిగా మార్చబోతోంది. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఏఐ కీలకంగా మారబోతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏఐ యుగంలోకి అడుగుపెట్టింది. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా ఏఐ యుగాన్ని ప్రారంభించింది. స్టార్టప్ కంపెనీల ద్వారా 18 ఆసుపత్రుల్లో ఆవిష్కరణలు చేసింది. దీని కోసం 40 పరికరాలను ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది. ఇలా 15 రకాల డయాగ్నస్టిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. క్యాన్సర్‌తో పాటు గుండె, టీబీ, ఇతర వ్యాధులను ఏఐ ద్వారా గుర్తిస్తారు. ఇక నుంచి ఈ అధునాతన సాంకేతికత ద్వారా రోగులకు వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అతి తక్కువ సమయంలో వ్యాధి నిర్ధారణతో పాటు, ఉత్తమ చికిత్సలు అందించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకు రాష్ట్రంలో తొలి అడుగు పడింది. ఈ ఏఐ ద్వారా రోగులకు మరిన్ని వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర వైద్య శాఖ అధికారులు కృషి చేస్తారు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana