
DET:MAR 06:
చెన్నైలో గ్రాండ్ లాంచ్:
చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో శుక్రవారం ఉదయం టెక్స్లా చిత్ర షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది.ఈ వేడుకకు సీమాన్ సముద్రఖని వంటి సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.గతంలో లాల్ సలామ్ వంటి వైవిధ్యమైన చిత్రాన్ని అందించిన ఐశ్వర్య ఇప్పుడు ఒక నాస్టాల్జిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో మన ముందుకు వస్తున్నారు.
తండ్రీకొడుకులుగా జై – సూరజ్?
ఈ సినిమాలో మలయాళ వర్సటైల్ యాక్టర్ సూరజ్ వెంజరాముడు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఆయన ఇందులో తమిళ నటుడు జైకి తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు.దశాబ్దాల క్రితం నాటి గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ కథలో పిల్లల ప్రపంచం మరియు వారి భావోద్వేగాలను ప్రధానంగా చూపించబోతున్నారు.డ్రాగన్ ఫేమ్ జార్జ్ మరియన్ కూడా ఇందులో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
యువన్ శంకర్ రాజా మ్యూజిక్ మ్యాజిక్:
ఈ సినిమాకు సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా బాణీలు సమకూరుస్తున్నారు.ఐశ్వర్య రజనీకాంత్ సినిమాల్లో సంగీతానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది.ఇక యువన్ తోడవ్వడంతో పాటలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.కన్నన్ రవి గ్రూప్ ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
పాన్-ఇండియా రిలీజ్:
టెక్స్లా చిత్రాన్ని కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు,మలయాళం,కన్నడ మరియు హిందీ భాషల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమా టైటిల్ టీజర్‌ను ఇప్పటికే మణిరత్నం,సుకుమార్ వంటి ప్రముఖ దర్శకులు విడుదల చేసి చిత్ర యూనిట్‌కు మద్దతు తెలిపారు.
