DET:MAR 07:
కథా నేపథ్యం:
చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామంలో శివాజీ నిజాయితీ గల పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తుంటాడు.ఆయన భార్య లయ భర్తను ఎప్పుడూ డామినేట్ చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి.ఇక వారి కొడుకు మాస్టర్ రోహన్ సోషల్ మీడియా రీల్స్ పిచ్చితో అల్లరి చేస్తుంటాడు.అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో అనుకోకుండా లోకల్ ఎస్సై వీరి ఇంట్లో శవమై కనిపిస్తాడు.ఆ శవాన్ని వీరు ఎలా దాచారు? పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నారు? అనేదే ఈ సినిమా కథ.

ఎలా ఉందంటే?
సినిమా పాయింట్ వినడానికి కొత్తగా ఉన్నా,కథనం మాత్రం చాలా నెమ్మదిగా సాగుతుంది.ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం క్రైమ్‌లో ఇరుక్కుంటే ఎలా ఉంటుందనే విషయాన్ని దర్శకుడు సుధీర్ శ్రీరామ్ కామెడీ యాంగిల్‌లో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే స్క్రీన్‌ప్లేలో పట్టు లేకపోవడం,కామెడీ అక్కడక్కడా మాత్రమే వర్కవుట్ అవ్వడం సినిమాకు మైనస్.సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్లు సాగదీసినట్లు అనిపిస్తాయి.క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అంతగా ఆకట్టుకోదు.

నటీనటుల పనితీరు:

శివాజీ తన సహజమైన నటనతో మధ్యతరగతి తండ్రి పాత్రలో ఒదిగిపోయారు.ఆయన కామెడీ టైమింగ్ కొన్ని చోట్ల నవ్వులు పూయిస్తుంది.లయ చాలా కాలం తర్వాత కనిపించినా భర్తను తిట్టే గయ్యాళి భార్యగా అద్భుతంగా నటించారు.వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన బలం.మాస్టర్ రోహన్ చురుగ్గా కనిపించగా,ఆలీ,ధన్‌రాజ్,ఇమ్మాన్యుయేల్ తమ పరిధి మేర నటించారు. విలన్‌గా శరత్ లోహితాశ్వ రొటీన్ పాత్రలోనే కనిపించారు.

సాంకేతిక అంశాలు:
దర్శకుడు సుధీర్ శ్రీరామ్ మంచి కథను ఎంచుకున్నా దాన్ని ఆసక్తికరంగా మలచడంలో తడబడ్డారు.రంజన్ రాజ్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది కానీ పాటలు పెద్దగా గుర్తుండవు.రిత్విక్ రెడ్డి సినిమాటోగ్రఫీ పల్లెటూరి వాతావరణాన్ని చక్కగా చూపించింది.ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే నిడివి తగ్గేది.సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా కేవలం ఒకసారి చూడదగ్గ రొటీన్ క్రైమ్ కామెడీ.శివాజీ,లయల కోసం ఒకసారి ప్రయత్నించవచ్చు.కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆశించి వెళ్తే మాత్రం నిరాశ తప్పదు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana