
DET:MAR 06:
అత్యంత ఖరీదైన ప్రాంతంలో నివాసం:
చెన్నైలోని పోస్ గార్డెన్ అంటే అది కేవలం ఒక ఏరియా మాత్రమే కాదు ఒక స్టేటస్ సింబల్.దివంగత ముఖ్యమంత్రి జయలలిత సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి హేమాహేమీలు నివసించే ఈ ప్రాంతంలో నయనతార దంపతులు అడుగుపెట్టారు.ఈ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ ధర సుమారు ₹31.5 కోట్లు ఉంటుందని సమాచారం.దీని విస్తీర్ణం దాదాపు 14,369 చదరపు అడుగులు.
వాటా ఎవరిది ఎంత?
తాజా నివేదికల ప్రకారం ఈ ప్రాపర్టీలో నయనతారకు 90% వాటా ఉండగా విఘ్నేష్ శివన్కు 10% వాటా ఉంది.లెగసీ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులోని 4వ మరియు 5వ అంతస్తుల్లో ఈ డ్యూప్లెక్స్ ఇల్లు విస్తరించి ఉంది.ఈ ఇంటికి ఏకంగా ఎనిమిది రిజర్వ్డ్ పార్కింగ్ స్లాట్లు ఉండటం దీని విలాసానికి నిదర్శనం.
పెరుగుతున్న రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియో:
నయనతారకు ఇప్పటికే చెన్నై,హైదరాబాద్ మరియు కేరళలో పలు ఖరీదైన ఆస్తులు ఉన్నాయి.ఈ కొత్త కొనుగోలుతో ఆమె మొత్తం రియల్ ఎస్టేట్ విలువ ₹100-120 కోట్లకు చేరుకుందని అంచనా.ఇటీవలే నటుడు ధనుష్ కూడా ఇదే పోస్ గార్డెన్లో ₹150 కోట్లతో ఒక భవనాన్ని నిర్మించుకున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు నయనతార కూడా అదే లీగ్లో చేరిపోయారు.
డిసెంబర్లోనే రిజిస్ట్రేషన్:
ఈ ప్రాపర్టీకి సంబంధించిన సేల్ డీడ్ గత ఏడాది డిసెంబర్లోనే పూర్తయిందని అయితే తాజాగా ఈ వార్త వెలుగులోకి వచ్చిందని సమాచారం.ఈ ఇంట్లోకి త్వరలోనే ఈ జంట తమ కవల పిల్లలు ఉయిర్ మరియు ఉలగ్లతో కలిసి మారబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానులు దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
