D Spiritual: Feb 2: ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీ భగవద్ రామానుజాచార్య స్వామివారికి అంకితంగా నిర్వహిస్తున్న 108 దివ్యదేశాల 4వ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి స్వీయ పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్నాయి.

సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరుగుతున్న సమతాకుంభ్–2026 వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. సోమవారం ఉదయం 19–36 దివ్యదేశములలో కొలువుదీరిన దివ్య దేశాధీశులకు తిరుమంజన సేవ కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా సామూహిక రామానుజ నూత్తందాది పారాయణం నిర్వహించారు.

సోమవారం సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభువుకు హనుమద్వాహన సేవ నిర్వహించనున్నారు. అలాగే 37 నుంచి 54 దివ్యదేశములలో కొలువుదీరిన దివ్య దేశాధీశులకు 18 గరుడ వాహన సేవలు జరగనున్నాయి.

ప్రతీరోజూ సుప్రభాత సేవతో ప్రారంభమయ్యే కార్యక్రమాల్లో అష్టాక్షరీ మంత్రజపం, ఆరాధన, సేవాకాలం, నిత్య పూర్ణాహుతి, మంగళాశాసనం, శాత్తుముఱై, తీర్థప్రసాద గోష్టి, బలిహరణ వంటి నిత్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సమతా కుంభ్ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 9 వరకు జరగనున్న నేపథ్యంలో ప్రతీరోజూ వేలాది మంది భక్తులు ఇక్కడకు వచ్చి బ్రహ్మోత్సవాల్లో తన్మయత్వం పొందుతున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana