
SDports 22Jan 2026: ప్రపంచకప్ సన్నాహక సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఈ పోరులో టీమిండియా 48 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది.ఓపెనర్ అభిషేక్ శర్మ (84 పరుగులు) ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి జట్టుకు భారీ స్కోరు అందించాడు. చివర్లో రింకూ సింగ్ (44 నాటౌట్) తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. శివం దూబే, వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను కట్టడి చేశారు.అభిషేక్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
