
DSports Jan09 2026:సిడ్నీ: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు మరోసారి చేతులెత్తేసింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేక 4-1తో సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. సిడ్నీ టెస్టు ముగిసిన అనంతరం కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ, జట్టు ప్రదర్శనపై నిశిత విమర్శలు చేశారు.
- “తొలి ఇన్నింగ్స్‌లో మేం మరో 100 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం కచ్చితంగా వేరేలా ఉండేది. బ్యాటింగ్ వైఫల్యమే మా ఓటమికి ప్రధాన కారణమైంది” అని స్టోక్స్ పేర్కొన్నారు ప్రత్యర్థి జట్టును కనీసం 100 పరుగులు తక్కువ స్కోరుకే కట్టడి చేయలేకపోవడం కూడా తమకు మైనస్ అయిందని ఆయన అభిప్రాయపడ్డారు
- “ఇతర జట్లు మా దూకుడు ఆటను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నాయి. మేం సులభంగా పరుగులు చేస్తున్నప్పుడు ప్రత్యర్థులు మా బలహీనతలను కనిపెట్టి దెబ్బకొడుతున్నారు. ఇకపై పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది” అని చెబుతూ బజ్‌బాల్ వ్యూహంలో మార్పులు ఉంటాయనే సంకేతాలిచ్చారు.”ఆస్ట్రేలియాలో ఆడటం బలహీనులకు సాధ్యం కాదు. మేం బలహీనులం అని నేను అనను, కానీ కీలక సమయాల్లో ఒత్తిడిని జయించడంలో ఆసీస్ జట్టు మాకంటే మెరుగ్గా ఉంది.”
