న్యూయార్క్ టెన్నిస్ కోర్టులో మరోసారి అరీనా సబలెంక అదరగొట్టింది. ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న బెలారస్ స్టార్‌ ఆటగాడు అరీనా సబలెంక , యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు మూడోసారి వరుసగా చేరడం ద్వారా తన స్థిరతను మళ్లీ నిరూపించింది.

గురువారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో, సబలెంక అమెరికా క్రీడాకారిణి జెస్సికా పెగులా పై 4-6, 6-3, 6-4 స్కోర్‌తో విజయం సాధించింది. మొదటి సెట్లో వెనుకబడి పోయినా, తర్వాతి రెండు సెట్లలో దూకుడు ప్రదర్శించి గేమ్‌ను తిరగదలిపింది. ఈ గెలుపుతో, ఆమె యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌కు మరొక అడుగు దూరంలో నిలిచింది.

విజయ మార్గంలో సబలెంక:

2025 సీజన్‌లో ఇప్పటివరకు మూడు టోర్నమెంట్‌లు గెలిచిన సబలెంక ఇప్పటికీ తన ఫామ్‌ను కొనసాగిస్తూ వస్తోంది. కెరీర్‌లో ఇప్పటివరకు ఆమె ఖాతాలో 19 టైటిళ్లు చేరాయి. ఈసారి కూడా ఆమె ట్రోఫీ గెలవగలిగితే, సెరెనా విలియమ్స్‌ తర్వాత వరుసగా రెండు సార్లు యూఎస్‌ ఓపెన్‌ విజేతగా నిలిచిన తొలి మహిళా ఆటగారిగా చరిత్ర సృష్టించనుంది.

ఫైనల్లో ఎవరిదే సవాల్?

శనివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో, సబలెంక అమాండా అనిసిమోవా (8వ సీడ్) లేదా నవోమీ ఒసాకా (23వ సీడ్)లలో ఎవరితోనైనా తలపడనుంది. ఇద్దరూ క్షణక్షణాన మారే ఆటకు పేరుగాంచిన వారు కావడంతో, ఫైనల్ సమరానికి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నారు.

By Deepak

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana