
DSports Dec20 2025: అహ్మదాబాద్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అంటే మైదానంలో దూకుడుకు మారుపేరు. కానీ, దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో టీ20లో ఆయనలోని మానవీయ కోణం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన షాట్‌కు గాయపడిన ఒక కెమెరామెన్ పట్ల హార్దిక్ ప్రదర్శించిన బాధ్యత, ప్రేమాభిమానాలు ఇప్పుడు అభిమానుల మనసు గెలుచుకుంటున్నాయి.
భారత ఇన్నింగ్స్ 13వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన హార్దిక్, తాను ఎదుర్కొన్న తొలి బంతినే (బౌలర్ కోర్బిన్ బాష్) లాంగ్ ఆఫ్ దిశగా భారీ సిక్సర్‌గా మలిచారు. ఆ బంతి నేరుగా వెళ్లి బౌండరీ లైన్ వద్ద విధుల్లో ఉన్న ఒక కెమెరామెన్ చేతికి బలంగా తగిలింది. దీంతో అతను తీవ్ర నొప్పితో విలవిలలాడాడు. ఇది గమనించిన హార్దిక్ వెంటనే ఆందోళన చెందారు.
