
DSports Dec20 2025:అహ్మదాబాద్: దక్షిణాఫ్రికాపై ఘనవిజయంతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న ఆనందంలో ఉన్న టీమిండియాకు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. జట్టుగా అద్భుత ప్రదర్శన చేసినా, వ్యక్తిగతంగా ఒక పెద్ద లోటు ఉండిపోయిందని సూర్య నిజాయతీగా అంగీకరించారు.వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుంటే, కెప్టెన్ సూర్య ఫామ్‌లోకి రావడం అత్యవసరం. “నేను ఫామ్ కోల్పోలేదు, పరుగులు మాత్రమే రావడం లేదు. నెట్స్‌లో బంతిని బాగానే బాదుతున్నాను” అని సూర్య ధీమా వ్యక్తం చేస్తున్నారు.
