
DSports Dec20 2025: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా మరో ఘనవిజయం దిశగా దూసుకెళ్తోంది. మూడో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు ఆరో వికెట్ కోల్పోయి ఓటమికి అంచున నిలిచింది. ప్రస్తుతం ఇంగ్లండ్ విజయం సాధించాలంటే మరో 228 పరుగులు చేయాలి, కానీ చేతిలో కేవలం 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం క్రీజులో జేమీ స్మిత్ (2), విల్ జాక్స్ (11) ఉన్నారు. ఐదో రోజు ఉదయం సెషన్లోనే మిగిలిన వికెట్లు తీసి సిరీస్ను 3-0తో సొంతం చేసుకోవాలని ఆసీస్ పట్టుదలతో ఉంది.
