DET:DEC 12:
బెంజ్ సినిమాలో నివిన్ పౌలీ పాత్ర గురించి తాజా అప్‌డేట్:
మలయాళ నటుడు నివిన్ పౌలీ త్వరలో బెంజ్ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు.ఈ సినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తుండగా ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దీనికి కథ అందించి.తన G Squad బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నివిన్ పౌలీ మాట్లాడుతూ,తన పాత్ర చాలా క్రూరంగా ఉంటుందని,సినిమా ఒక బ్లడ్‌బాత్ లా ఉంటుందని చెప్పడం జరిగింది.

లోకేష్ కనగరాజ్ యూనివర్స్‌లో భాగం:

ఈ బెంజ్ సినిమా లోకేష్ కనగరాజ్ సినిమాల యూనివర్స్ అయిన LCU లో భాగమని తెలుస్తోంది.నివిన్ పౌలీ ఇందులో ముఖ్య ప్రతినాయకుడిగా వాల్టర్ అనే పాత్రలో ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం.లోకేష్ కనగరాజ్ కథ మరియు నిర్మాణ విలువలు ఉండడంతో,ఈ సినిమా యాక్షన్ ప్రియులకు ఒక మంచి విందుగా ఉంటుందని అంతా భావిస్తున్నారు.ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు.

విలన్‌గా నివిన్ పౌలీ కొత్త లుక్:
నివిన్ పౌలీ సాధారణంగా ప్రేమమ్ లాంటి సినిమాలలో సాఫ్ట్ రోల్స్ చేయడంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు.కానీ ఈ బెంజ్ సినిమాలో ఆయన క్రూరమైన ట్విన్ ఫిష్ వాల్టర్ అనే విలన్ పాత్రలో నటిస్తుండడం విశేషం.ఈ పాత్ర చాలా కఠినంగా, దయ లేకుండా ఉంటుందని,అందుకే ఆయన ఈ పాత్రను బ్లడ్‌బాత్ అని అభివర్ణించారని తెలుస్తోంది.నివిన్ పౌలీ ఈ కొత్త పవర్ఫుల్ విలన్ పాత్రలో ఎలా మెప్పిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.