
DET:DEC 12:
రాధికా ఆప్టే నటించిన సాలీ మొహబ్బత్:
సాలీ మొహబ్బత్ అనేది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా.ఇందులో ప్రధాన పాత్రలో రాధికా ఆప్టే నటించారు.ఈ సినిమాకు మరింత ప్రత్యేకత ఏమిటంటే దీని ద్వారా ప్రముఖ నటి టిస్కా చోప్రా తొలిసారిగా దర్శకురాలిగా మారారు.నటనలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న టిస్కా చోప్రా,దర్శకత్వంలో ఎలా మెప్పిస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
విడుదల తేదీ ఎప్పుడు?
ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా OTT ప్లాట్‌ఫారమ్‌లో విడుదలవుతోంది.సాలీ మొహబ్బత్ సినిమా డిసెంబర్ 12,2025 న స్ట్రీమింగ్ ప్రారంభం అవుతుంది.అంటే ఈ రోజు డిసెంబర్ 12 నుండే ఈ సినిమాను ప్రేక్షకులు చూడవచ్చు.
ఏ OTT ప్లాట్‌ఫారమ్‌లో చూడాలి?
టిస్కా చోప్రా దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ చిత్రాన్ని ZEE5 OTT ప్లాట్‌ఫారమ్‌లో చూడవచ్చు.ఈ సినిమా ZEE5 లో మాత్రమే ప్రత్యేకంగా విడుదల అవుతుంది.ZEE5 సబ్స్క్రిప్షన్ ఉన్నవాళ్లు డిసెంబర్ 12 నుండి ఈ సినిమాను వీక్షించవచ్చు.
సినిమా నేపథ్యం ఏమిటి?
సాలీ మొహబ్బత్ ఒక క్రైమ్,థ్రిల్లర్, మిస్టరీ నేపథ్యంలో రూపొందించబడింది.రాధికా ఆప్టే ఇందులో స్మితా అనే గృహిణి పాత్ర పోషించారు.తన సాధారణ జీవితంలో ఊహించని విధంగా ఒక డబుల్ మర్డర్ మిస్టరీ చుట్టుముట్టడం వల్ల ఆమె జీవితం ఎలా తలకిందులు అయింది? అనేదే ఈ కథాంశం.ఈ సినిమాలో ద్వివేందు శర్మ,అనురాగ్ కశ్యప్ కూడా ముఖ్యపాత్రల్లో నటించారు.
