D Spiritual: Dec 12: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి, 31న వైకుంఠ ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

డిసెంబరు 30 – వైకుంఠ ఏకాదశి:
వేకువజామున 12.05 గంటల నుండి 2.30 గంటల వరుకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. అనంతరం వేకువజామున 2.30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు రాత్రి కైంకర్యాలు జరగగా, తిరిగి 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు దర్శనాల కోసం అవకాశముంటుంది.

డిసెంబరు 31 – వైకుంఠ ద్వాదశి:
ఉదయం 4 గంటల నుండి 5.30 వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6 నుండి 7 వరకు తిరుచ్చి ఉత్సవం జరుగుతుంది. అలాగే ఉదయం 8.30 నుండి 9.30 వరకు చక్రస్నానం నిర్వహించనున్నారు.

జనవరి 1, 2026 – ఆంగ్ల నూతన సంవత్సరం:
వేకువజామున 1 గంట నుండి 4 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. అనంతరం వేకువజామున 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు సర్వదర్శనానికి అనుమతి ఉంటుంది. సాయంత్రం 4 నుండి 5 వరకు రాత్రి కైంకర్యాలు జరగగా, తర్వాత సాయంత్రం 5 నుండి రాత్రి 8.30 వరకు స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు.

ఈ రెండు పర్వదినాలను పురస్కరించుకొని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ మరియు అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆలయంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana