D Spiritual: Dec 10: మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి రోజు ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తూ దేవదేవతలను నమస్కరించడం ఒక పురాతన ఆనవాయితీ. భగవంతుడిని నిత్యం భక్తి–శ్రద్ధలతో పూజించడం వలన అనేక శుభఫలితాలు కలుగుతాయని భావిస్తారు. అందుకే ప్రతిరోజూ ఇంటిలో దీపారాధన చేస్తూ పూజలు చేయడం చాలా మందిలో అలవాటుగా ఉంది. ఇంట్లో నిత్యం దీపారాధన చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ, దీపారాధన చేసే సమయంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి; లేకపోతే పూజ ఫలితం కలగడం కష్టం.

ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడానికి ముందు తప్పనిసరిగా స్నానం చేయాలి. స్నానం చేసిన అనంతరం పూజ చేయడం వలన దేవతల అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతాయి. ఉదయం స్నానం చేసి పూజ చేయడం అత్యంత శ్రేయస్కరం. సాయంత్రం స్నానం చేయడం సాధ్యంకాకపోతే, కనీసం శుభ్రంగా చేతులు, కాళ్లు కడిగి పూజ చేయాలి. ఇలాక్రమంగా దీపారాధన చేస్తూ ఉంటే ఇంట్లో దుష్టశక్తులు ప్రవేశించవు, అలాగే ఇంటిలో అనుకూల వాతావరణం ఏర్పడి మన పనులు సజావుగా, విజయవంతంగా సాగుతాయి.

ఏ ఇంట్లో ప్రతిరోజూ దీపం, ధూపం వెలిగిస్తారో ఆ ఇంట్లో ఇబ్బందులు తగ్గి, పిల్లలతో పాటు పెద్దల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. అంతేకాదు, ఆర్థిక పరంగా కూడా కుటుంబం స్థిరంగా అభివృద్ధి చెందుతుందని సంప్రదాయ విశ్వాసం. ఇంట్లో దీపారాధన చేయడానికి ఆముదం లేదా నువ్వుల నూనెను ఉపయోగించడం అత్యంత శుభకరం. గోనెత్తితో దీపం వెలిగిస్తే మరింత శ్రేష్ఠమైన ఫలితాలు కలుగుతాయని చెబుతారు. దాంతో పాటు, స్టీల్ ప్రమిదలో దీపం పెట్టడం మంచిది కాదని, మట్టి లేదా ఇత్తడి ప్రమిదలు ఉపయోగించడం శుభకరమని సూచిస్తున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana