D Spiritual: Dec 10: తిరుపతి జిల్లా పోలీస్‌ యంత్రాంగం హెల్మెట్‌ వాడకంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కొత్త ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించింది. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని గుర్తుచేస్తూ, “నో హెల్మెట్‌ నో పెట్రోల్‌” కాన్సెప్ట్‌ను అనుసరించాల్సిందిగా సూచించింది. ఇందులో భాగంగా “నో హెల్మెట్‌ నో రైడ్‌” అనే నిబంధనను కఠినంగా అమలు చేయాలని భావిస్తోంది.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సేవలపై భక్తుల నుండి విశ్లేషణాత్మకంగా అభిప్రాయాలు సేకరించే ప్రక్రియను ప్రారంభించింది. భక్తులకు అందించే సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వివిధ రకాల ఫీడ్‌బ్యాక్‌ సర్వేలు ద్వారా భక్తుల విలువైన సూచనలను సేకరిస్తోంది.

రాష్ట్రంలోని ఆలయాల్లో భక్తులకు అందిస్తున్న సేవలపై నిరంతరం ఫీడ్‌బ్యాక్‌ను సేకరించి వాటిని ఇంకా మెరుగుపరచాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో టీటీడీ పలు చర్యలను చేపట్టింది. టీటీడీ ఐవీఆర్‌ఎస్‌, వాట్సాప్‌, శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల అభిప్రాయాలను నిరంతరం సేకరిస్తూ ఉంది.

ఐవీఆర్‌ఎస్‌ ఫీడ్‌బ్యాక్ సర్వే:
ఈ సర్వేలో తిరుమల యాత్ర అనుభవం, అన్నప్రసాదం, కల్యాణకట్ట, శ్రీవారి ఆలయం, వసతి, లగేజీ కౌంటర్‌, ప్రైవేట్ హోటళ్ల ధరలు వంటి మొత్తం 17 ప్రశ్నలపై భక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు.

వాట్సాప్ ఫీడ్‌బ్యాక్ విధానం:
తిరుమల, తిరుపతిలో ఉన్న పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూ ఆర్‌ కోడ్‌ను మొబైల్‌తో స్కాన్ చేస్తే టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది. భక్తులు తమ పేరు, విభాగాన్ని (అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూలైన్‌, గదులు మొదలైనవి) ఎంచుకుని తమ అభిప్రాయాన్ని టెక్స్ట్ లేదా వీడియో రూపంలో ఇవ్వవచ్చు. సేవా ప్రమాణానికి — ఉత్తమం, సగటు/మెరుగుదల అవసరం లేదా బాగోలేదు — అనే రేటింగ్ ఇవ్వాలి. గరిష్టంగా 600 అక్షరాల మేర అభిప్రాయం టైప్‌ చేయవచ్చు లేదా వీడియో అప్‌లోడ్ చేయవచ్చు. వాట్సాప్ నంబర్‌: 9399399399.

శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయ సేకరణ:
తిరుమల, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో సేవకులు ప్రశ్నావళి పత్రాల ద్వారా భక్తుల అభిప్రాయాలను ప్రత్యక్షంగా సేకరిస్తారు. అందులో భక్తులు వివరాలు నమోదు చేసి తమ అనుభవాలను తెలియజేయవచ్చు. భక్తుల సూచనలు, సలహాలు సేవలను మరింత మెరుగుపరచేందుకు ఈ విధానంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.

డయల్ యువర్ ఈవో:
ప్రతి నెల మొదటి శుక్రవారం జరిగే “డయల్ యువర్ ఈవో” కార్యక్రమంలో టీటీడీ ఈవో స్వయంగా భక్తులతో మాట్లాడి సలహాలు మరియు సూచనలు స్వీకరిస్తారు. ఇందుకోసం భక్తులు 0877-2263261 నంబర్‌కు కాల్ చేసి తమ అభిప్రాయాలను నేరుగా తెలియజేయవచ్చు.

ఈ-మెయిల్ ద్వారా అభిప్రాయ సేకరణ:
భక్తులు టీటీడీ ఉన్నతాధికారులకు ఈ-మెయిల్‌ ద్వారా కూడా తమ సూచనలను తెలియజేయవచ్చు. ఇలా వివిధ మార్గాల ద్వారా సేకరించిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని మరింత సంఖ్యలో భక్తులకు నాణ్యమైన సేవలను అందించేందుకు టీటీడీ కృషి చేస్తోంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana