
DNews:06 Dec: యాదాద్రి–భువనగిరి జిల్లాలోని బోర్వెల్ రిగ్ యజమానులు, పనివారిని ప్రపంచంలోని పలుదేశాలకు పంపే ప్రాంతంగా ప్రసిద్ధి. ఈ జిల్లాకు చెందిన ప్రవీణ్ అనే యువకుడు ఇప్పుడు విదేశంలో కిడ్నాప్‌కు గురయ్యాడు.భువనగిరి మండలం బండ సోమారం గ్రామానికి చెందిన నల్లమాస జంగయ్య–మహేశ్వరి దంపతుల చిన్న కొడుకు ప్రవీణ్, హైదరాబాద్‌లోని ఒక బోర్వెల్ సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తుండేవాడు. కంపెనీ తరఫున గత ఏడాది నవంబరులో దక్షిణాఫ్రికాకు వెళ్లిన అతడు, ప్రస్తుతం మాలి రాష్ట్రంలోని కోబ్రి ప్రాంతంలో బోర్ రిగ్ పనులను పర్యవేక్షిస్తున్నాడు.
గత నెల 23న పనులు ముగించుకుని తన షెల్టర్‌కు వెళ్తుండగా, మార్గమధ్యంలో జేఎన్ఐఎం సంస్థకు చెందిన ఉగ్రవాదులు అతడిని కిడ్నాప్ చేసినట్లు కంపెనీ ప్రతినిధులు నిర్ధారించారు. ప్రతిరోజు తల్లిదండ్రులతో మాట్లాడే ప్రవీణ్ అచానకగా సంప్రదింపులు నిలిచిపోవడంతో కుటుంబంలో ఆందోళన పెరిగింది. కిడ్నాప్ సమాచారం చేరిన తర్వాత తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమై ఉన్నారు.జేఎన్ఐఎం (JNIM) ఉగ్రవాద సంస్థ గతంలో కూడా అదే ప్రాంతంలో పలు విదేశీయులను కిడ్నాప్ చేసిన నేపథ్యం ఉంది. ప్రవీణ్ ఆచూకీ కోసం బోర్వెల్ కంపెనీ భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.కుటుంబ సభ్యులు అతని క్షేమం కోరి ప్రభుత్వాన్ని మరియు విదేశీ వ్యవహారాల శాఖను సహాయానికి కోరుతున్నారు.
