DNews:06 Dec:దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా వందే భారత్ రైళ్ల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ కొత్త రైలును కూడా ప్రారంభించడం ద్వారా ప్రయాణికులకు సరికొత్త సౌకర్యాన్ని అందిస్తోంది.

ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న నాలుగు వందే భారత్ రైళ్ల సేవలలో కొన్ని వ్యూహాత్మక మార్పులు చేసింది.కాచిగూడ – యశ్వంత్‌పూర్ – కాచిగూడ (20703/20704) ఇప్పటివరకు ప్రతి బుధవారం ఈ రైలు సేవ అందుబాటులో ఉండేది కాదు. తాజా మార్పుల ప్రకారం, ఇకపై బుధవారం కాకుండా శుక్రవారం ఈ రైలు రద్దు అవుతుంది.సికింద్రాబాద్ – విశాఖపట్నం – సికింద్రాబాద్ (20707/20708) మునుపటి షెడ్యూల్ ప్రకారం గురువారం ఈ రైలు నడవడం లేదు. అయితే తాజా మార్పుల ప్రకారం, ఇకపై గురువారం స్థానంలో సోమవారం ఈ రైలు రద్దు కానుంది.

దక్షిణ మధ్య రైల్వే ప్రకటన ప్రకారం, ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వచ్చాయి. అయితే ప్రయాణికుల సౌకర్యం కోసం రైళ్ల టైమింగ్స్, హాల్ట్‌లు, ఫ్రీక్వెన్సీ వంటి అంశాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. నిర్వహణలో సమయపాలన మెరుగుపర్చడం, సేవా సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం ఈ మార్పులు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.రద్దు చేసిన రోజుల్లో ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న వారికి పూర్తి రీఫండ్ లేదా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

ప్రయాణికులకు శుభవార్త – తిరుపతి–షిర్డీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

వందే భారత్ మార్పులతో పాటు దక్షిణ మధ్య రైల్వే మరో మంచి వార్తను ప్రకటించింది. తిరుపతి – సాయినగర్ షిర్డీ – తిరుపతి మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17425/17426) రైలును ప్రవేశపెట్టింది.ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే తిరుపతి మరియు సాయినగర్ షిర్డీ మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును (17425/17426) ప్రకటించింది.రైలు నంబర్: 17425/17426 ,ప్రారంభం డిసెంబర్ 14 నుంచి షెడ్యూల్ వివరాలు ప్రతీ ఆదివారం ఉదయం 4:00 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుంది.అదే రోజు సాయంత్రం 4:50 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది.తరువాత సోమవారం ఉదయం 10:45 గంటలకు షిర్డీ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.ఈ రైలులో రెండు ఏసీ బోగీలు, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉండనున్నాయి.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana