D Spiritual: Dec 5: సాధారణంగా కొన్ని ఇళ్లలో దుష్టశక్తుల ప్రభావం ఉండడం వల్ల అక్కడ నివసించే వారికి అనేక సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి ఇళ్లలో నివసించే వారు నిరంతరం భయపడటం, నిద్రలో పీడకలలు రావడం, ఒక్కసారిగా భయంతో లేచిపోవడం, పగటిపూట కూడా వింత శబ్దాలు వినిపించడం వంటి అనుభవాలు ఎదుర్కొంటారు. అదనంగా, ఇలాంటి ఇంట్లో కుటుంబ సభ్యులు తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడటం కూడా సాధారణమే. ఇలాంటి పరిస్థితుల్లో దుష్టశక్తుల ప్రభావాన్ని తగ్గించే మరియు తొలగించే కొన్ని పద్ధతులు వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

ఇంట్లో తరచూ ఇలాంటి సమస్యలు ఎదురైతే మొదటగా పండితులను పిలిపించి శాంతి పూజలు, హోమాలు చేయించుకోవటం మంచిది. అదేవిధంగా ప్రతిరోజూ ఇంట్లో ధూపం వేయడం వల్ల అక్కడి ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. జీలకర్ర మరియు ఉప్పును సమపాళ్లలో తీసుకుని ఇంటి ధారాల వద్ద, కిటికీల వద్ద చల్లడం కూడా దుష్టశక్తులను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇలా మాత్రమే కాకుండా ఇంటి ప్రధాన ద్వారం మీద పసుపుతో స్వస్తిక్ లేదా ఓం గుర్తులు వేయడం ద్వారా కూడా ఆ స్థలం శుభ్రతను, పవిత్రతను పొందుతుంది. తులసి ఆకులను తీసుకుని వాటి రసం రాగి కలశంలోని నీటిలో కలిపి ఆ నీటిని ఇల్లంతా చల్లడం కూడా ఎంతో ప్రభావవంతమైంది. ఇది దుష్టశక్తి ప్రభావాన్ని పూర్తిగా తొలగిస్తుందని పండితులు సూచిస్తున్నారు.

అలాగే ఇంట్లో నిత్యం హనుమంతుడిని పూజించడం కూడా అత్యంత శ్రేయస్కరం. హనుమంతుడి కృప వలన దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవని నమ్మకం ఉంది.