
D Spiritual: Dec 5: దేవుడిని దర్శనం చేసుకొని కోరికలను కోరేటప్పుడు కళ్లను మూసుకోవడం చాలా మంది భక్తులు సహజంగా చేసే ఒక పద్ధతి. అయితే ఇలా చేయడం మంచిదా కాదా అనే సందేహం చాలామందిలో ఉటపడుతుంది. ఈ విషయంపై పండితులు ఏమంటున్నారో తెలుసుకోవడం అవసరం.
మామూలుగా ఇంట్లో లేదా ఆలయాలకు వెళ్ళినప్పుడు దేవుళ్లకు పూజ చేయడం సహజం. ప్రత్యేకించి అందులో కొంతమంది తరచుగా ఆలయాలను సందర్శించే వారు. దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు, కోరికలను కోరుకునేటప్పుడు చాలామంది కళ్లను మూసుకొని మొక్కుతారు. గుడిలో అయినా, ఇంట్లో అయినా కళ్లను మూసుకోవడమే ఎక్కువ మందిలో కనిపించే అలవాటు. అయితే కొంతమంది మాత్రం అంత దూరం ప్రయాణించి దేవాలయాలకు వెళ్లినప్పుడు దేవుడిని కళ్లారా చూడాలని, కళ్ళు మూసుకోవద్దని అంటుంటారు.
ఈ విషయంపై పండితుల అభిప్రాయాన్ని తెలుసుకుంటే హిందూ ధర్మంలో దేవతలను అనేక రూపాల్లో కొలుస్తారని తెలుస్తుంది. దేవతా శక్తికి ప్రతీకగా ఆలయాల్లో విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. పండగలు మరియు ప్రత్యేక రోజుల్లో భక్తులు ఆలయాలకు వెళ్లి మొక్కులు పెట్టుకుంటారు. అప్పుడు చాలామంది కళ్లను మూసుకొని దండం పెడతారు. భక్తి భావం పెర్చడానికి దేవాలయ వ్యవస్థ ఏర్పాటైందని శాస్త్రాలు చెబుతున్నాయి. రోజువారీ జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ప్రతిరోజూ సమీప దేవాలయాలకు వెళ్లి కొంతసేపు గడపాలని హిందూ ధర్మం సూచిస్తుంది.
దేవాలయాలకు వెళ్లి దేవతా విగ్రహాలను దర్శించడం ద్వారా మనలోని శక్తి రీఫ్రెష్ అవుతుందని హిందూ ధర్మం చెబుతుంది. ఆలయాలను నిర్మించేటప్పుడు, విగ్రహాలను ప్రతిష్ఠించేటప్పుడు వేద మంత్రాలు, యంత్రాలతో ప్రత్యేక శక్తులను సమకూరుస్తారు. కనుక దేవతా విగ్రహాలను దర్శించే సమయంలో కళ్ళు తెరిచి స్వామివారిని దర్శించుకోవాలని వేద పండితులు సూచిస్తున్నారు. పూలు, అలంకారాలతో అలంకరించిన దేవాలయ విగ్రహాలను కనులారా దర్శించడం మనసుకు అపారమైన ప్రశాంతతను ఇస్తుంది.
మానవ శరీరంలో అనేక నాడులు, గ్రంధులు ఉంటాయి. మనసు ప్రశాంతంగా మారాలంటే సెరోటొనిన్ మరియు ఎండార్ఫిన్ అనే హార్మోన్ల విడుదల అవసరం. సెరోటొనిన్ పైనీయల్ గ్రంధి నుండి విడుదలై మనసుకు సంతోషాన్ని ఇస్తుంది. ఎండార్ఫిన్ పిట్యూయిటరీ గ్రంధి మరియు హైపోతాలామస్ నుండి విడుదలై ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను కలిగిస్తుంది. దేవతా విగ్రహాలను కళ్లారా దర్శించినప్పుడు ఈ గ్రంధులు యాక్టివ్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో మనసు మరియు శరీరం రెండూ రిలాక్స్ అవుతాయి.
అందువల్ల ఇంట్లో అయినా, ఆలయంలో అయినా దేవుడిని మొక్కేటప్పుడు లేదా దండం పెట్టుకునేటప్పుడు కళ్లను తెరిచి స్వామివారిని దర్శించడం శాస్త్రపరంగా మరియు శారీరకంగా ఎంతో మేలు చేస్తుందని పండితుల అభిప్రాయం.
