DET:DEC 05:
అద్భుతమైన కలయిక ఐశ్వర్య రాయ్ బచ్చన్, డకోటా జాన్సన్:
సౌదీ అరేబియాలోని జెద్దాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక రెడ్ సీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2025 లో ఒక అద్భుతమైన, ఊహించని కలయిక జరిగింది. మన బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ హాలీవుడ్ స్టార్ డకోటా జాన్సన్ను కలిశారు. సాధారణంగా ఈ ఇద్దరినీ కలిపి చూడటం అభిమానులకు ఒక గొప్ప ఆశ్చర్యం. పక్కపక్కనే కూర్చుని, మాట్లాడుకుంటున్న వారి ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

రెడ్ సీ ఫెస్టివల్‌లో సందడి:

ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఈ ఫెస్టివల్‌లో నల్లటి గౌనులో తనదైన స్టైల్‌లో చాలా అందంగా మెరిశారు.ఇన్-కాన్వర్జేషన్ అనే సెషన్‌లో ఆమె పాల్గొని, సినిమా ప్రయాణం, మాతృత్వం, కుమార్తె ఆరాధ్య గురించి మాట్లాడారు.ఈ సెషన్‌కు డకోటా జాన్సన్ కూడా హాజరయ్యారు. అక్కడ ఈ ఇద్దరు గ్లోబల్ స్టార్స్ మాట్లాడుకోవడం, నవ్వుకోవడం కెమెరాల్లో చిక్కాయి. 50 షేడ్స్ ఆఫ్ గ్రే” ఫేమ్ డకోటా జాన్సన్ కూడా ఈ కార్యక్రమంలో చాలా చురుగ్గా కనిపించారు.

నెటిజన్ల రియాక్షన్ ఊహించని కొలాబ్:

ఈ ఇద్దరు తారలు మాట్లాడుకుంటున్న దృశ్యాలు ఇంటర్నెట్‌లోకి రాగానే అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఇది నిజంగా ఊహించని కొలాబ్,రెండు అందాల భామలు ఒకే ఫ్రేమ్‌లో! అని కామెంట్స్ పెట్టారు. భారతీయ సినీ రంగంలో ఐశ్వర్య రాయ్ ఎంత పెద్ద స్టార్ అనేది అందరికీ తెలిసిందే. అలాగే డకోటా జాన్సన్ హాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ ఇద్దరు ఒకే వేదికపై కలవడం వారి మధ్య చిరు సంభాషణలు జరగడం చూసి నెటిజన్లు తెగ సంబరపడిపోయారు.

గ్లోబల్ వేదికపై ఇండియన్ సత్తా:
ఐశ్వర్య రాయ్ బచ్చన్ గత కొన్ని సంవత్సరాలుగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలవడం, హాలీవుడ్ ప్రముఖులతో కలిసి వేదికను పంచుకోవడం భారతీయ సినీ ప్రియులకు గర్వకారణం. ఈ సమావేశం కేవలం ఇద్దరు తారల కలయిక మాత్రమే కాదు, బాలీవుడ్, హాలీవుడ్ మధ్య పెరుగుతున్న సంబంధాలకు కూడా ఒక సంకేతం.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana