
DET:DEC 04:
స్పిరిట్ మొదటి షెడ్యూల్ పూర్తి ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్!
ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా స్పిరిట్ గురించి ఓ ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయినట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో ముఖ్యంగా కొన్ని ఇంటెన్స్ జైలు సన్నివేశాలు మరియు హీరోయిన్ త్రిప్తి డిమ్రి తో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారట.
ఉత్కంఠ భరితమైన జైలు సన్నివేశాలు:
స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ఒక నిజాయితీ గల ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని ఇప్పటికే తెలుసు. అయితే మొదటి షెడ్యూల్‌లో తీసిన సన్నివేశాలలో ప్రభాస్ జైలు దుస్తుల్లో ఉన్నట్టుగా ఖైదీగా ఉన్న సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇవి చాలా ఉద్వేగభరితంగా మరియు ఉత్కంఠభరితంగా తెరకెక్కించారట. సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్ అండ్ డ్రామా ఈ సన్నివేశాల్లో కనిపిస్తుందని టాక్. ఈ యాక్షన్ డ్రామా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
త్రిప్తి డిమ్రి ప్రభాస్ మధ్య నైట్ సీక్వెన్స్:
జైలు సన్నివేశాలతో పాటు హీరోయిన్ త్రిప్తి డిమ్రితో కూడా కొన్ని కీలకమైన సన్నివేశాలను పూర్తి చేశారు. ముఖ్యంగా రాత్రిపూట చిత్రీకరించిన ముఖ్యమైన సంభాషణ సన్నివేశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సన్నివేశాలను హైదరాబాద్‌లోని ఒక ఉమెన్స్ కాలేజీలో ప్రత్యేకంగా జైలు వాతావరణం వచ్చేలా సెట్ వేసి షూట్ చేశారట. ఈ సినిమా యాక్షన్ తో పాటు ప్రభాస్, త్రిప్తి మధ్య మంచి లవ్ ట్రాక్ కూడా ఉంటుందని సమాచారం.
త్వరలో తదుపరి షెడ్యూల్ ఎక్కడంటే?
మొదటి షెడ్యూల్ పూర్తయిన తరువాత టీమ్ కొద్దిపాటి విరామం తీసుకోనుంది. ప్రభాస్ కూడా కొద్ది రోజులు బ్రేక్ తీసుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. తదుపరి షెడ్యూల్ అంతర్జాతీయ లొకేషన్లలో ప్లాన్ చేస్తున్నారట. మెక్సికో ఇండోనేషియా వంటి దేశాల్లో షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
