DET:DEC 04:
జాబితాలో అమితాబ్ బచ్చన్ పేరు:
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా ఖుషిపురా ప్రాంతానికి సంబంధించిన ఓటర్ల రికార్డుల్లో అమితాబ్ బచ్చన్ పేరు దర్శనమిచ్చింది. హౌస్ నంబర్ 54 వద్ద ఆయన పేరుతో పాటు ఆయన తండ్రి హరివంశ రాయ్ బచ్చన్ పేరు కూడా జాబితాలో ఉండటం గమనార్హం. జాబితాలో అమితాబ్ వయస్సు 76 సంవత్సరాలుగా పేర్కొనబడింది మరియు ఆయన 2003లో ఓటు వేశారని కూడా రికార్డుల్లో ఉంది. ఈ వివరాలు ప్రజలను మరియు అధికారులను తీవ్ర గందరగోళానికి గురిచేశాయి.

అసలు విషయం ఏంటి?
నిజానికి హౌస్ నంబర్ 54 లో నివసిస్తున్న వ్యక్తి పేరు సురేంద్ర కుమార్ 76 అతని తండ్రి పేరు రాజేష్ కుమార్. ఓటర్ల జాబితాలో సురేంద్ర కుమార్ పేరు బదులుగా అమితాబ్ బచ్చన్ పేరు అతని తండ్రి పేరు వరుసగా 543 మరియు 544 నంబర్లలో నమోదై ఉన్నట్టు తదుపరి దర్యాప్తులో తేలింది. స్థానికులను అడిగితే తమ ప్రాంతంలో అమితాబ్ బచ్చన్‌ను ఎప్పుడూ చూడలేదని సినిమాల్లో మాత్రమే చూశామని చెప్పడం ఈ వివాదాన్ని మరింత పెంచింది. అంతేకాకుండా ఆ హౌస్ నంబర్ 54 ఉన్న చోట ఇప్పుడు ఒక గుడి ఉందని కూడా అధికారులు గుర్తించారు.

అధికారులపై ఒత్తిడి దర్యాప్తు డిమాండ్:
SIR ఓటర్ల జాబితా ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఇటువంటి పెద్ద పొరపాటు జరగడంపై పాలనా యంత్రాంగంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ రికార్డుల్లోని తప్పులకు బాధ్యత ఎవరిది అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఇటువంటి లోపాలు ఎలా జరిగాయో వివరించాలని మరియు దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ వ్యవహారం త్వరలోనే మరింత ముందుకు సాగే అవకాశం ఉంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana