
DNews:04 Dec:ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. ఏడాదిలోపు ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభిస్తామని వ్యాఖ్యానించారు. వరంగల్‌తో పాటు ఆదిలాబాద్‌కు అన్ని రకాల వసతులతో కూడిన ఎయిర్‌పోర్టు ఉండాల్సిందేనని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక్కడ ఎయిర్‌పోర్టు వస్తే ఆదిలాబాద్‌కు పరిశ్రమలు వస్తాయని పేర్కొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.ఎర్రబస్సే కాదని.. ఆదిలాబాద్‌కు ఎయిర్ బస్సు కూడా తీసుకువస్తామని చెప్పుకొచ్చారు. ఇవాళ(గురువారం) ఆదిలాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. అనంతరం ప్రసంగించారు. ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఓటును ఆయుధంగా మార్చి ప్రజాపాలన తీసుకువచ్చారని తెలిపారు సీఎం రేవంత్‌రెడ్డి.
ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటోందని తెలిపారు. రెండేళ్లలో ఏరోజూ తాను విశ్రాంతి తీసుకోలేదని చెప్పుకొచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధే లక్ష్యమని వ్యాఖ్యానించారు. సంక్షేమం – అభివృద్ధి రెండుకళ్లుగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.గత నిరంకుశ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపారని విమర్శించారు. గత పాలకులు ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలించారని ధ్వజమెత్తారు. విపక్ష నేతలను కలుపుకుని తాము ముందుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. కేసీఆర్ హయాంలో సీఎం సభల్లో.. విపక్ష ఎమ్మెల్యేలకు ఎప్పుడైనా మాట్లాడే అవకాశం ఇచ్చారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో సచివాలయానికి వెళ్తే గేట్లకు తాళం వేసి అడ్డుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
