D Spiritual: Dec 3: వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. గణపతి నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తూ, పూజలు, ఉత్సవాలతో ప్రతి చోటా భక్తి వాతావరణం నెలకొంటుంది. ఈ సమయంలో వినాయకుడు కలలో దర్శనం ఇస్తే దాని అర్థం ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. ఈ కథనంలో స్వప్న శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకుందాం.

మనకు నిద్రలో వచ్చే కలలు కొన్నిసార్లు మరిచిపోతాం, మరికొన్నిసార్లు మాత్రం మర్చిపోలేం. కొన్ని కలలు మనలో ఆలోచనలు రేకెత్తిస్తాయి. ముఖ్యంగా దేవతల దర్శనం కనిపిస్తే దాని అర్థం ఏంటో తెలుసుకోవాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. అందులోనూ గణపతి దర్శనం అయితే అది పాజిటివ్‌ గానే భావించ బడుతుందని పండితులు చెబుతున్నారు.

విఘ్నాలను తొలగించే దేవుడిగా గణపతి ప్రసిద్ధి పొందాడు. కలలో ఆయన కనిపించడం అంటే జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని భావిస్తారు. మన దేశంలో ఏ శుభకార్యం మొదలెట్టినా ముందుగా వినాయకునికి పూజలు చేయడం కూడా ఇదే కారణం. అదే విధంగా కలలో గణపతి దర్శనం కూడా విజయానికి సంకేతం అని నమ్మకం.

గణేశుడు శుభానికి, మంచితనానికి ప్రతిరూపం. ఆయన కలలో కనిపిస్తే మీపై స్వామి ఆశీస్సులు ఉన్నట్టే. కొత్త పనులు ప్రారంభించడానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయమని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా, మీరు చేయాలి అనుకుని వాయిదా వేసిన మంచి పనిని స్వామి కలలో దర్శనం ద్వారా గుర్తు చేస్తాడని నమ్ముతారు. అప్పగించిన బాధ్యతలను మర్చిపోతే వాటిని కూడా గుర్తు చేసే సంకేతంగా భావిస్తారు.

అయితే గణపతిని బలవంతంగా కలలో రప్పించుకోవడం అవసరం లేదు. కలలు మన ఆలోచనలు, మన పరిస్థితులు, మన పరిసరాల ప్రతిబింబమని నిపుణులు సూచిస్తున్నారు. సహజంగా వచ్చిన కలలకే అర్ధం ఉంటుందని, అవే నిజం అయ్యే అవకాశాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana