D Spiritual: Nov 28: శుక్రవారం లక్ష్మీదేవిని పూజించే రోజు కావడంతో, ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన పూలతో పూజించడం ఎంతో శుభప్రదమని పండితులు చెబుతున్నారు. వారంలోని ప్రతి రోజుకూ ప్రత్యేక దేవతలను పూజించే ఆనవాయితీ ఉంది. శుక్రవారం మాత్రం ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఇలా పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభించడంతో పాటు ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయని విశ్వసిస్తారు. ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు పూలతో పూజిస్తే ఆమె కటాక్షం త్వరగా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మిని పూజించాలంటే ఎరుపు మందారం, గులాబీ, కలువ వంటి ఎర్రటి పూలతో పూజించడం అత్యంత శుభప్రదం. ఈ పూలు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనవని పండితులు చెబుతున్నారు. ఇంట్లో మందారం మొక్క పెంచితే శ్రీ మహాలక్ష్మి స్వయంగా ఇంట్లో కొలువై ఉన్నట్టేనని నమ్మకం ఉంది. అలాగే గన్నేరు పూలతో కూడా పూజించవచ్చు. ఎరుపు లేదా పసుపు గన్నేరు పూలతో పూజిస్తే సిరిసంపదలు పెరగడంతో పాటు ఉద్యోగ సమస్యలు తొలగుతాయని విశ్వసిస్తారు.

పసుపు రంగు బంతి, చామంతి పూలు కూడా శుక్రవారం పూజకు ఉపయోగించవచ్చు. అయితే పూజకు ఉపయోగించే పూలను ముందుగా నీటితో తడపకూడదని పండితులు సూచిస్తున్నారు. అలాగే అమ్మవారిని పూజించేటప్పుడు శంఖం, గవ్వలు, శ్రీ ఫలం ఇంటిపూజలో ఉంచితే ఆర్థిక సమస్యలు తొలగుతాయని నమ్మకం. ముఖ్యంగా శ్రీ ఫలాన్ని ప్రతిరోజూ పూజిస్తే అనవసర ఖర్చులు తగ్గుతాయని, వ్యాపారంలో లాభాలు పెరుగుతాయని చెబుతారు. రైతులు కూడా పంట పండేందుకు క్షేత్రంలో శ్రీ ఫలం ఉంచితే మేలు జరుగుతుందని నమ్ముతారు. శ్రీ ఫలంతో పాటు నాణేలు ఉంచితే శుభం మరింత పెరుగుతుందని కూడా చెబుతారు.

ఇంట్లో లక్ష్మీదేవిని సంతోషపెట్టాలంటే నిత్యం దీపారాధన చేయడం ఎంతో ముఖ్యం. దీపారాధన లేని ఇంట్లో అమ్మవారు నిలవరని పురాణాలు చెబుతున్నాయి. అతిథి సత్కారం లేని ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదని విశ్వాసం. భగవంతుణ్ణి నిందించే వారు, అసత్యాలు మాట్లాడేవారి ఇంట సిరిసంపదలు నిలవవని పండితులు చెబుతున్నారు. అలాగే సూర్యోదయం తర్వాత ఎక్కువసేపు నిద్రపోవడం, సాయంత్రం సమయంలో నిద్రలో పడిపోవడం కూడా శుభం కాదని, ఇలా చేసే వారిని శ్రీ మహాలక్ష్మి దూరంగా ఉంటుందని అంటారు. సోమరుల ఇంట్లో అమ్మవారి కటాక్షం ఉండదని శాస్త్రాలు సూచిస్తున్నాయి.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana