D Spiritual: Nov 28: మన హిందూ సంప్రదాయాల్లో మహిళలు అమ్మవారికి నూతన వస్త్రాలను సమర్పించే ఆచారం ప్రముఖంగా ఉంటుంది. అమ్మవారికి సమర్పించిన ఈ వస్త్రాలను తిరిగి తీసుకుని ధరిస్తే శుభం కలుగుతుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు, కొన్ని ఆలయాల్లో అమ్మవారి వస్త్రాలను వేలంపాటలో దక్కించుకుని భక్తులు వాటిని పవిత్ర ప్రసాదంగా భావిస్తారు. అలాంటి వస్త్రాలు ఇంటికి తీసుకువెళ్తే, ఆ ఇంటికి శాంతి, శ్రేయస్సు వస్తాయని విశ్వసిస్తారు.

అయితే అమ్మవారికి సమర్పించిన వస్త్రాలను ధరించే విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఈ చీరలను ఎప్పుడైతే పూజా కార్యక్రమాలు ఉంటాయో, ఆ సందర్భాల్లో మాత్రమే ధరించాలి. సాధారణ రోజుల్లో లేదా ఇతర పనుల కోసం ఈ చీరలను ఉపయోగించరాదు. పూజల్లో ఈ చీరను ధరించిన తర్వాత, ఇంటికి వచ్చాక అవి శుభ్రంగా ఉతికి, ఆ నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో పారవేయాలి.

అలాగే ఒకసారి ఈ చీరలను కట్టుకున్నప్పుడు, పూజ పూర్తయ్యే వరకు మాత్రమే వాటిని ధరించాలి. ముఖ్యంగా అమ్మవారికి సమర్పించిన చీరలు ధరించి ఎట్టి పరిస్థితుల్లోనూ పడకగదిలోకి వెళ్లకూడదు. అంతేకాదు, మనం ఎవరైనా ఇంటికి పూజా కార్యక్రమాలకు వెళ్లినప్పుడు ఇచ్చే తాంబూలంలో ఉండే రవికల విషయంలో కూడా ఇదే నియమాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఈ రవికలు కూడా పవిత్రమైనవే కాబట్టి వాటిని పూజలకు మాత్రమే ఉపయోగించడం శ్రేయస్కరం.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana