D Spiritual: Nov 28: అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు ప్రతి సంవత్సరం మాలను ధరించి శబరిమలకు ప్రయాణం చేస్తారు. మండల దీక్ష, జ్యోతి దీక్షను చేపట్టే స్వాములను వారి దీక్ష సంవత్సరాల ప్రకారం వివిధ పేర్లతో పిలుస్తారని చాలామందికి తెలియదు. సాధారణంగా అయ్యప్ప దర్శనం కోసం ఐదుసార్లు కంటే ఎక్కువసార్లు మాల వేసుకున్నవారిని ‘గురు స్వామి’ అని పిలుస్తారు. ప్రస్తుతం కార్తీక మాసం ప్రారంభంతో లక్షలాది మంది అయ్యప్ప మాలలు ధరించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా నల్ల దుస్తులతో, నుదుట చందనం, తిలకంతో నియమ నిష్టలతో ఉన్న అయ్యప్ప భక్తులే కనిపిస్తున్నారు.

మాలధారణ చేసిన స్వాములు 41 రోజుల పాటు నియమాలు పాటిస్తూ ఉపవాస దీక్షలో పాల్గొంటారు. కొందరు పూర్తి 41 రోజుల మండల దీక్ష, మరికొందరు అర్థమండల దీక్షను చేస్తారు. దీక్ష పూర్తయ్యాక ఇరుముడితో శబరిమలకు చేరుకుని అయ్యప్ప దర్శనం చేసుకుని పూజలు పూర్తిచేసిన తర్వాత మాలను తీస్తారు. ఈ విధంగా ప్రతీ సంవత్సరం మాలను వేసుకునే స్వాములకు ఒక్కో సంవత్సరానికి ఒక్కో ప్రత్యేక పేరు ఉంటుంది. అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న 18 మెట్లకు ప్రతీకగా, మాలను 18సార్లు వేసుకునే స్వాములకు 18 పేర్లు ఉన్నాయి.

అయ్యప్ప స్వామి మాల ధారణ ప్రతి సంవత్సరానికి పేర్లు:

  1. 1వ సారి – కన్నె స్వామి
  2. 2వ సారి – కత్తి స్వామి
  3. 3వ సారి – గంట స్వామి
  4. 4వ సారి – గద స్వామి
  5. 5వ సారి – విల్లు స్వామి
  6. 6వ సారి – జ్యోతి స్వామి
  7. 7వ సారి – సూర్య స్వామి
  8. 8వ సారి – చంద్ర స్వామి
  9. 9వ సారి – వేలు స్వామి
  10. 10వ సారి – విష్ణు చక్ర స్వామి
  11. 11వ సారి – శంఖాధార
  12. 12వ సారి – నాగాభరణ స్వామి
  13. 13వ సారి – శ్రీహరి స్వామి
  14. 14వ సారి – పద్మ స్వామి
  15. 15వ సారి – త్రిశూల స్వామి
  16. 16వ సారి – శబరిగిరి స్వామి
  17. 17వ సారి – ఓంకార స్వామి
  18. 18వ సారి – నారికేళ స్వామి

పురాణాల ప్రకారం, అయ్యప్ప స్వామి తనకు దర్శనానికి కన్నెస్వామి వచ్చినప్పుడు మహిషిని వివాహం చేసుకుంటానని వాగ్దానం చేశాడని కథనం. ప్రతి ఏడాది మాలికాపురత్తమ్మ శబరిగిరికి వచ్చి కన్నెస్వాములు శరం గుత్తిలో గుచ్చిన బాణాలు చూసి నిరాశగా తిరిగి వెళ్తుందని కూడా ఓ నమ్మకం. ఈ విధంగా అయ్యప్ప భక్తి, మాలధారణ, దీక్షలకు సంబంధించిన అనేక విశ్వాసాలు శతాబ్దాలుగా కొనసాగుతున్నాయి.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana