DHealth 26Nov: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat) ఆరోగ్య బీమా పథకంలో కీలక సంస్కరణ చేపట్టింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు అందించే ఆరోగ్య బీమా పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. ఈ నిర్ణయంతో కోట్లాది మంది పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఆయుష్మాన్ భారత్ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలంటే: ముఖ్యంగా సామాజిక ఆర్థిక కుల గణన (SECC) డేటాలో పేరు నమోదు చేసుకున్న వారికే ఈ పథకం వర్తిస్తుంది. మీరు అర్హులో కాదో తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ అయిన ‘Mera PMJAY’ పోర్టల్‌ను సందర్శించి మీ మొబైల్ నంబర్ మరియు రేషన్ కార్డు వివరాలు సమర్పించాలి. అర్హత ఉన్నవారు, తమ సమీపంలోని ఆయుష్మాన్ మిత్ర కేంద్రంలో లేదా ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన పత్రాలు (ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్) సమర్పించి ఉచితంగా ఆయుష్మాన్ కార్డును పొందవచ్చు. ఈ కార్డు ద్వారా రూ. 10 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలను దేశంలోని ప్యానల్ ఆసుపత్రులలో పొందవచ్చు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana