
DNews: 26 Nov: ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం (నవంబర్ 26) స్పీకర్ చాంబర్లో నవీన్ యాదవ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, అజారుద్దీన్, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
నవంబర్ 14న విడుదలైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అఖండ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రెండో స్థానంలో నిలవగా, బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ మైదానంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు, మొదటి రౌండ్ మినహా అన్ని రౌండ్లలో తన మెజారిటీని ప్రదర్శించారు. బీఆర్ఎస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో నవీన్ యాదవ్ కూడా స్పష్టమైన ఆధిక్యాన్ని చూపించి విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున విజయోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అవిన్ యాదవ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
