D Spiritual: Nov 26: భారతీయ సంప్రదాయంలో ‘హాయ్’, ‘హలో’ వంటి పలకరింపులు లేవు. ఒక్కో దేశంలో పలకరించే విధానం ఒక్కోలా ఉంటే, మన దేశంలో మాత్రం ప్రత్యేకమైన శైలిలో అభివాదం చేస్తారు. ఒకరిని కలిసినప్పుడు రెండు చేతులను జోడించి నమస్కారం చేయడం మన సంస్కృతిలో సహజంగా కనిపించే పద్ధతి. ‘నమ’ అంటే వంగి ఉండటం, ఆ వంగిన స్థితిలో చేతులు జోడించి చేయడం నమస్కారం అని అర్థం. అలా ప్రత్యేకంగా నమస్కారం చేయడానికి కారణమేంటి? సింపుల్‌గా ‘హాయ్’, ‘హలో’ అనేస్తే సరిపోతుందని అనిపించినా, దీనికి ఎంతో లోతైన భావం ఉంది.

మన సంప్రదాయంలో నమస్కారం అనేది వేలాది సంవత్సరాలుగా వస్తున్న ఒక ఆచారం. నమస్కరించే విధానం ఎదుటి వ్యక్తి స్థానాన్ని బట్టి మారుతుంది. దేవతలను నమస్కరించేప్పుడు రెండు చేతులను సహస్రారంపై ఉంచి నమస్కరిస్తారు. పెద్దలు ఎదురుపడితే నుదుటిపై చేతులను జోడించి నమస్కారం చేస్తారు. సాటి వారిని కలిసినప్పుడు హృదయ స్థాయిలో చేతులు జోడించి నమస్కరిస్తారు. ఇది గౌరవం, వినయం, పరస్పర శుభాశీస్సుల భావనలను తెలియజేస్తుంది.

తల్లి, తండ్రి, గురువు, దైవం వంటి అత్యున్నత స్థానంలో ఉన్న వారికైతే సాష్టాంగ నమస్కారం చేస్తారు. దీనిని దండప్రణామం కూడా అంటారు. శరీరంలోని అష్టాంగాలు భూమికి తగిలేలా, కర్రలా వంగి చేసే నమస్కారం ఇది. స్త్రీలు మాత్రం పంచాంగాలతో నమస్కారం చేయడం ఆనవాయితీగా ఉంది. ఈ విధమైన నమస్కారాల్లో ప్రతి రూపంలోనూ గౌరవం, వినయం, శరణాగతి భావం ప్రతిఫలిస్తుంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana