
D Spiritual: Nov 25: సాధారణంగా మానవ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు గ్రహాల అనుకూల స్థితి కాకపోవడంతో సమస్యలు వెంటాడుతాయి. దురదృష్టం వెంటాడటం వల్ల మనం చేసే పనులు కలిసి రావటం మాత్రమే కాదు, మానసిక ఇబ్బందులు కూడా తలెత్తుతుంటాయి. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నవారు కొన్ని చిన్న పరిహారాలు చేస్తే అదృష్టం కలిసివస్తుందని నమ్మకం ఉంది.
ఆర్థిక సమస్యలు, పనులు సరిగా కలిసి రాకపోవడం వంటి ఇబ్బందులు ఉన్నవారు కొబ్బరికాయ తల భాగంలో పచ్చ కర్పూరం వెలిగించి దిష్టి తీసుకోవచ్చు. ఈ విధంగా 21 సార్లు దిష్టి తీసిన తర్వాత ఆ కొబ్బరికాయను పారుతున్న నీటిలో వదిలేయాలి. కుటుంబ సభ్యులందరికీ ఒక్కొక్కరికి ఒక్కో కొబ్బరికాయతో ఈ విధంగా చేయాలి. ఈ పరిహారం చేయడానికి మంగళ, శని, గురువారాలు ఎంతో ముఖ్యమైనవి. అలాగే శని దోషంతో బాధపడేవారు అన్నదానం చేస్తే శని ప్రభావం తగ్గుతుందని చెబుతారు.
ఈ పరిహారంతో పాటు, మానసిక క్షోభతో బాధపడుతున్న వారు దుప్పటిని తలపై 21 సార్లు తిప్పి పేదలకు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల దోషాలు తొలగుతాయని నమ్మకం ఉంది. ఈ ఉపాయం శనివారం చేయడం శ్రేయస్కరం.
ఇక ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోవాలంటే పక్షులకు ఆహారం పెట్టడం చాలా ముఖ్యం. పక్షులకు ఆహారం ఇచ్చడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణం తొలగి, అనుకూల వాతావరణం ఏర్పడుతుందని చెబుతారు.
