D Spirituyal: Nov 25: హనుమంతుడు, ఆంజనేయుడు సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు. భోళా శంకరుల వలే ఆయన కూడా భక్తికి పొంగిపోతాడు. రామనామ కీర్తన వినుటకు ఆయన అపారంగా సంతోషిస్తాడు, అనుగ్రహం ప్రసాదిస్తాడు. అయితే స్వామికి కొన్ని పూలు, ఆకులు అంటే ప్రత్యేకమైన ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి. వాటి విశేషాలను తెలుసుకుందాం.

సీతారాముల ప్రీతి కోసం హనుమంతుడు సిందూరం ధరించాడనీ, తమలపాకుల మాలను ధరించాడనీ కథల్లో చెప్పబడింది. అందుకే హనుమంతుడిని ఎవరు అనునిత్యం సేవిస్తూ ఉంటారో, అలాంటి భక్తులకు తమ అనుగ్రహం తప్పక లభిస్తుందని సీతారాములే సెలవిచ్చారు.

అలాంటి హనుమంతుడు అనేక క్షేత్రాల్లో అర్చామూర్తిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉన్నాడు. హనుమంతుడికి పూలంటే మహా ఇష్టం అని ఆధ్యాత్మిక గ్రంధాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా మల్లెలు, సన్నజాజులు, సంపెంగలు, పొగడలు, పొన్నాగులు, మందారాలు, కనకాంబరాలు, గులాబీలు ఆయనకు ప్రీతికరాలు.

హనుమంతుడికి ఇష్టమైన ఈ పుష్పాలతో ఆయనను పూజించడం వలన ఆయన అనుగ్రహం త్వరితగతిన లభిస్తుంది. ఈ పూలతో స్వామిని సేవించడం ద్వారా భూత–ప్రేత–పిశాచ బాధలు, గ్రహ సంబంధ దోషాలు తొలగిపోవడమే కాదు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, విజయాలు కూడా చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana